News August 21, 2025
‘గో బ్యాక్ మార్వాడీ’.. రేపు యాదాద్రి జిల్లా బంద్

యాదాద్రి భువనగిరి జిల్లాలో ‘గో బ్యాక్ మార్వాడీ’ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో రేపు జిల్లా బంద్‌కు సభ్యులు పిలుపునిచ్చారు. మార్వాడీల వ్యవస్థను నిర్మూలించాలని, తెలంగాణ సంస్కృతిని, ప్రజలను కించపరుస్తున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు JAC ప్రకటించింది. JAC జిల్లా అధ్యక్షుడు రాజేశ్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను హేళన చేస్తున్న మార్వాడీల వైఖరిని ఖండించారు.
Similar News
News January 14, 2026
HYD: సీఎం సభల తర్వాతే మున్సిపల్ నగారా!

TGలో మున్సిపల్ పోరుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అయితే, దీనికి ముందే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కలియతిరగనున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 3 భారీ సభలు నిర్వహించనుంది. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఈ సభలు ముగిసిన వెంటనే SEC ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం టూర్ ఖరారైన తర్వాతే క్లారిటీ రానుంది. STAY TUNED..
News January 14, 2026
KNR: సీపీ సెలవుపై ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన సీపీ ఆఫీస్!

కరీంనగర్ పోలీస్ కమిషనర్ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది. ఓ ఎమ్మెల్యే ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురై ఆయన సెలవుపై వెళ్లినట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే సీపీ కార్యాలయ వర్గాలు దీన్ని ఖండించాయి. ఆయన ఈనెల 1న ముందస్తుగానే సెలవుకు దరఖాస్తు చేసుకున్నారని, జనవరి 11 నుంచి 17 వరకు వ్యక్తిగత కారణాలతోనే సెలవులో ఉన్నారని స్పష్టం చేశాయి.
News January 14, 2026
ఎన్డీఏతో కలిసే ప్రసక్తే లేదు: TVK

రాజకీయంగా తమను ఇబ్బందులు పెట్టినా NDAతో కలిసే ప్రసక్తే లేదని విజయ్ దళపతి TVK స్పష్టం చేసింది. తమ సిద్ధాంత వైఖరిలో మార్పు ఉండదని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ చెప్పారు. జన నాయగన్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందనను స్వాగతిస్తున్నామని, ఇది స్నేహపూర్వక మద్దతుగానే భావిస్తున్నట్లు చెప్పారు. కాగా జన నాయగన్‌కు సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా BJPనే అడ్డుకుంటోందని TVK ఆరోపిస్తోంది.


