News November 6, 2025

గ్రాముకు రూ.9వేల లాభం

image

RBI తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందించాయి. 2017 NOV 6న విడుదల చేసిన సిరీస్‌-VI బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,895గా(ఆన్‌లైన్‌లో ₹50 డిస్కౌంట్) నిర్ణయించారు. 8 ఏళ్ల కాలవ్యవధి పూర్తికావడంతో ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,066గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,121 లాభం వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం.

Similar News

News January 18, 2026

తెలుగు జాతి ఖ్యాతి ఎన్టీఆర్: పురందీశ్వరి

image

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి ఆదివారం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఒక ఉత్తమ నాయకుడు జన్మిస్తే ఆ వంశానికే కాక మొత్తం జాతికే గుర్తింపు వస్తుందని కొనియాడారు. ఉన్నత విలువలు కలిగిన ఎన్టీఆర్ వల్ల తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్త ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ తన తండ్రి జ్ఞాపకాలను పురందీశ్వరి స్మరించుకున్నారు.

News January 18, 2026

ట్రంప్ మోసం చేశాడు: ఇరాన్ నిరసనకారులు

image

US అధ్యక్షుడు ట్రంప్ తమకు ద్రోహం చేశారని ఇరాన్‌ నిరసనకారులు మండిపడుతున్నారు. దాడికి సిద్ధంగా ఉన్నామని, సాయం త్వరలోనే అందుతుందని చెప్పి ఇప్పుడు పట్టించుకోలేదని రగిలిపోతున్నారు. ప్రభుత్వం తమను అణచివేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ‘దేశంలో 15 వేల మంది మరణానికి ట్రంప్ కారణం. మమ్మల్ని ఆయుధాలుగా వాడుకుని మోసం చేశారు. ఖమేనీ ప్రభుత్వంతో డీల్ చేసుకున్నారు’ అని ఆరోపిస్తున్నారు.

News January 18, 2026

మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

image

మెనోపాజ్‌ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.