News September 10, 2025
గ్రామ పాలన అధికారులకు క్లస్టర్ల వారీగా బాధ్యతలు

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఎంపికైన గ్రామ పాలన అధికారులకు క్లస్టర్ల వారీగా బాధ్యతలు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఐడీవోసీలో గ్రామ పాలన అధికారులకు ఆయన కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించి, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్లస్టర్ల వారీగా బాధ్యతలు కేటాయించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలని ఆయన సూచనలు చేశారు.
Similar News
News December 8, 2025
సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు: పవన్

సనాతన ధర్మం మూఢనమ్మకం కాదని, ఆధ్యాత్మిక శాస్త్రమని AP Dy.CM పవన్ అన్నారు. ‘TNలో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలా జరగకుండా ప్రతి హిందువులో చైతన్యం రావాలి. భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు. ముఖ్యంగా యువత గీత చదవాలి. మనసు కుంగినా, ఆలోచనలు అయోమయంలోకి నెట్టినా గీత ఓ కౌన్సిలర్, మెంటర్‌గా పనిచేస్తుంది’ అని ఉడుపి క్షేత్రంలో చెప్పారు.
News December 8, 2025
పర్మినెంట్ హామీపై ఉమ్మడి నల్గొండ హోంగార్డుల ఆశలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న 1,200 మంది హోంగార్డులు పర్మినెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. రోజుకు 12 గంటలు పనిచేసినా, కేవలం ₹1000 వేతనంతో నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2003లో ఏర్పాటు చేసిన కమిటీ సూచనలు అమలు కాకపోవడంతో వారి పరిస్థితి మారలేదు. పర్మినెంట్ చేయకపోవడంపై హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News December 8, 2025
ధోనీ భారత్‌లో పుట్టినందుకు మనం గర్వపడాలి: విజయ్

ధోనీ భారత్‌లో పుట్టినందుకు మనమందరం గర్వపడాలని IND మాజీ క్రికెటర్ మురళీ విజయ్ అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. ‘ధోనీ సహజ, ప్రత్యేకమైన నాయకుడు. ఆయనలా నిర్ణయాలు తీసుకోవడం మరొకరికి సాధ్యం కాదు. 2007 T20 WC చివరి ఓవర్ జోగిందర్ శర్మతో వేయించడం ఇలాంటిదే. ధోనీ కొట్టే సిక్సర్ల రేంజ్ మరో రైట్ హ్యాండ్ బ్యాటర్ వల్ల కాదు’ అని వ్యాఖ్యానించారు. మహీ కెప్టెన్సీలో విజయ్ 8 సీజన్ల పాటు CSKకు ఆడారు.


