News September 13, 2025

గ్రూప్-1పై నిరుద్యోగుల ఆవేదన: హరీశ్ రావు

image

ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గ్రూప్-1పై నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా పరీక్ష నిర్వహిస్తారా అని స్వయంగా హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన ఇంకా మార్పు రాలేదన్నారు. శనివారం సిద్దిపేటలో జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Similar News

News December 13, 2025

ఏలూరు జిల్లాలో టెట్ పరీక్షకు 26 మంది గైర్హాజరు

image

ఏలూరు జిల్లాలో శనివారం నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు DEO వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలకు 400 మంది హాజరు కావాల్సి ఉండగా, 374 మంది హాజరయ్యారని తెలిపారు. 26 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని అన్నారు.

News December 13, 2025

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధరలు ఇలా!

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఇలా.. పత్తి కనిష్ఠంగా క్వింటా రూ.4,089, గరిష్ఠంగా రూ.7,609 పలికింది. వేరుశనగ కనిష్ఠ ధర రూ.3,509, గరిష్ఠ ధర రూ.6,588 వరకు నమోదైంది. ఆముదాలు కనిష్ఠంగా రూ.5,700, గరిష్ఠంగా రూ.6,100 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో పంటలు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

News December 13, 2025

JGTL: మొదటి విడత.. ఓటు వేయని థర్డ్‌ జెండర్‌.!

image

జగిత్యాల జిల్లాలో నిన్న జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు 7 మండలాల్లో పోలింగ్‌ నిర్వహించారు. ఈ విడతలో మొత్తం 2,18,194 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 1,20,238, స్త్రీలు 1,15,955 మంది ఉన్నారు. వీరితో పాటు కేవలం ఒకే ఒక్క థర్డ్‌ జెండర్‌ ఓటరు మెట్‌పల్లి మండలంలో నమోదై ఉన్నారు. ఆ ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని అధికారులు తెలిపారు. థర్డ్‌ జెండర్‌ ఓటరు పోలింగ్‌కు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.