News November 18, 2024

గ్రూప్-3 పరీక్షలో NRPT-కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రశ్న

image

ఈరోజు జరిగిన గ్రూప్-3 పరీక్షల్లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఓ ప్రశ్నను అడిగారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏది సరైనది కాదు.? అన్న ప్రశ్న వచ్చింది. గ్రూప్-3 పరీక్షలో నారాయణపేట జిల్లా నుంచి ప్రశ్న రావడం పట్ల భారతీయ కిసాన్ సంగ్, పలువురు జలసాధన సమితి సభ్యులు, ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News December 7, 2024

శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించిన హీరో నాగార్జున

image

శ్రీశైలం డ్యామ్‌ను ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున శుక్రవారం సందర్శించారు. మల్లన్న దర్శనార్థమై వచ్చిన ఆయన శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యలో డ్యామ్ వద్ద కాసేపు ఆగారు. జలాశయం అందాలను తిలకించారు. డ్యామ్ వద్ద ఉపాధి పొందే పలువురు ఫొటోగ్రాఫర్లు నాగార్జునతో ఫొటోలు దిగారు. అంతకుముందు నూతన వధూవరులు అక్కినేని నాగచైతన్య, శోభితతో కలిసి నాగార్జున శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు.

News December 6, 2024

వనపర్తి: కూతురు మరణం.. గుండెపోటుతో తండ్రి మృతి

image

వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో కూతురు చనిపోగా అది తట్టుకోలేని ఆ తండ్రి గుండె ఆగిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఖిల్లా ఘనపూర్‌లో నివాసముంటున్న దేవరశెట్టి శ్రీనివాసులు 17ఏళ్ల కుమార్తె వైశాలి అనారోగ్యంతో గురువారం చనిపోయింది. బిడ్డ మృతిని తట్టుకోలేని విలపిస్తున్న శ్రీనివాసులు కూతురు మృతదేహంపై పడి గుండెపోటుతో మృతిచెందారు. ఒకే రోజు తండ్రీకుతూరు మృతి స్థానింకగా కలిచివేసింది.

News December 6, 2024

MBNR: నియామక పత్రాలు అందజేయండి !

image

TGPSC ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో JL గా ఎంపికైన అభ్యర్థులు తమకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బొందలకుంట గ్రామానికి చెందిన జయరాములు, మొల్గర గ్రామానికి చెందిన మహేశ్, చందాపురం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తెలుగు అధ్యాపకులుగా ఎంపికయ్యారు. నియామక పత్రాలు వెంటనే అందజేసి ఇంటర్ విద్యలో తమను భాగం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.