News November 25, 2024
గ్రేటర్ పరిధిలో మిగిలింది 25 % కుటుంబాలే..
గ్రేటర్ HYDలో ఎన్యుమరేటర్లు సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేశారు. ఇప్పటికే దాదాపు 75% సర్వే పూర్తయింది. 18,26,524 కుటుంబాలకు సంబంధించి వివరాలు సేకరించారు. వీలైనంత త్వరగా మిగిలిన 25% ఇళ్లల్లో సర్వే పూర్తి చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. సర్వేలో ఎలాంటి తప్పులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News December 13, 2024
HYD: అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఈ డెయిరీ పాలే: గుత్తా
అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు విజయ డెయిరీ పాల ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని విజయ తెలంగాణ డెయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ సంచాలన్ భవన్‌లో నూతనంగా తెలంగాణ విజయపార్లర్‌ను గురువారం ప్రారంభించారు. విజయ తెలంగాణ డెయిరీ గత ఆరు దశాబ్దాల నుంచి రైల్వేతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోందన్నారు.
News December 13, 2024
HYD: పండుగలా నిర్వహించండి: కలెక్టర్
సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్ ఛార్జిల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40% పెంపు ప్రారంభోత్స ఏర్పాట్లపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, ఆర్డీవోలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
News December 13, 2024
ట్రాన్స్‌పోర్ట్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లకు భద్రత కల్పించండి
మరణించిన ఆటోడ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లకు సామాజిక భద్రత బీమా పథకం రెన్యువల్‌తోపాటు, వారి కుటుంబాలకు అందించే రూ.5 లక్షలను రూ.10 లక్షలకు పెంచాలని INTUC నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. గురువారం మంత్రిని కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే ప్రమాదంలో అంగవైకల్యం చెందిన డ్రైవర్లకు రూ.3 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని మంత్రిని కోరారు.