News April 8, 2025
గ్రేటర్ హైదరాబాద్‌కు NCAP కింద రూ.112.36 కోట్లు

11 శాఖల నుంచి రూ.423 కోట్ల ప్రతిపాదనలు వచ్చినా, 2024-25లో NCAP కింద కేంద్రం నుంచి రూ.112.36 కోట్లు మాత్రమే మంజూరు కానున్నట్టు కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. ఈ నిధులతో వాహనాల పొగ, డీజిల్ వాహనాల వినియోగం తగ్గింపు, విద్యుత్ వాహనాల ప్రోత్సాహం, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, చెత్త ఊడ్చే యంత్రాల కొనుగోలు వంటి కార్యక్రమాలు చేపట్టాలని కమిషనర్ ఇలంబర్తి అధికారులను సూచించారు.
Similar News
News April 22, 2025
మెదక్: ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలదే హవా.!

మెదక్ జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో విద్యార్థులు 49.21% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6,153 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3,028 పాస్ అయ్యారు. 3125 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో బాలుర ఉత్తీర్ణత శాతం 39.09 % కాగా, బాలికలు 57.05 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు పైచేయి సాధించడంతో జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
News April 22, 2025
నకిలీ పోలీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సాధారణ దుస్తులు ధరించి పోలీసుల పేరు చెప్పి ఎవరైనా వాహనాలు తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లయితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. పోలీసు సిబ్బంది ఎవరు కూడా సివిల్ డ్రెస్‌లో వాహనాలు తనిఖీ చేయరని అన్నారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ఖాకీ యూనిఫామ్ ధరించి వాహనాల తనిఖీలు చేస్తారని తెలిపారు. సివిల్ డ్రెస్‌లో తనిఖీ నిర్వహించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News April 22, 2025
నా జిల్లా మొదటి స్థానం: మంత్రి సీతక్క

ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో తన సొంత జిల్లా ములుగు మొదటి స్థానం, తాను ఇన్చార్జిగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లా రెండవ స్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. వెనకబడిన గిరిజన ప్రాంతాలైన ఈ రెండు జిల్లాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటడం ఎంతో సంతోషంగా ఉందని, కలెక్టర్, డీఈఓలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు