News November 20, 2025

గ్రేడ్ A రకం ధాన్యానికి రూ.2,389/-: అదనపు కలెక్టర్

image

గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,389 మద్దతు ధర చెల్లిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. చందుర్తి మండలం మూడపల్లి, ఆశిరెడ్డిపల్లి, వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి, నమిలిగుండుపల్లి తదితర గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.

Similar News

News January 20, 2026

పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు: హైకోర్టు

image

TG: చలాన్ల వసూలుపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దని, బైక్ కీస్ లాక్కోవడం, బండిని సీజ్ చేయడం లాంటివి చేయొద్దని పోలీసులను ఆదేశించింది. వాహనదారుడు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని సూచించింది. లేకుంటే నోటీసులు ఇవ్వాలని తెలిపింది. న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

News January 20, 2026

మెరుగైన శిక్షణతో విధుల్లో మరింత రాణించగలం: వరంగల్ సీపీ

image

పోలీస్ అధికారులు, సిబ్బంది మెరుగైన శిక్షణ పూర్తి చేయడం ద్వారా అప్పగించిన పనుల్లో మరింత రాణించగలమని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శివ కుమార్ హైదరాబాద్ యూసుఫ్‌గూడలో నిర్వహించిన ఆరు నెలల ఆయుధ మరమ్మతులపై శిక్షణ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో శిక్షణా కేంద్రం నుంచి జారీ చేసిన ధ్రువ పత్రాన్ని శివకుమార్‌కు సీపీ అందజేశారు.

News January 20, 2026

ప్రజల దృష్టి మళ్లించేందుకు CM ఎత్తులు: లక్ష్మణ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న బాధ్యులు ఎవరో తేల్చకుండా CM రేవంత్ రెండేళ్లుగా దర్యాప్తు పేరిట కాలయాపన చేశారని BJP MP లక్ష్మణ్ విమర్శించారు. ‘ప్రజల దృష్టి మళ్లించడానికి ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్యాపింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్యాపింగ్‌పై కవిత చేసిన ఆరోపణలకు BRS సమాధానం చెప్పాలి’ అని ఢిల్లీలో ఆయన పేర్కొన్నారు. కలహాలతో BRS ముక్కలవుతుందని జోస్యం చెప్పారు.