News July 3, 2024

చండూరు: ఉద్యోగం ఇప్పిస్తానని కౌన్సిలర్ చీటింగ్..

image

చండూరు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ చండూరుకు చెందిన నర్సింహ మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఓ కౌన్సిలర్.. చండూరు మునిసిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని 2021లో రూ.రెండు లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేష్ తెలిపారు.

Similar News

News December 5, 2025

NLG: గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి: మంత్రి

image

నల్గొండ జిల్లా తిప్పర్తి, జొన్నలగడ్డ గూడెం గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత అభివృద్ధి పనుల కోసం నిధులను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

News December 5, 2025

NLG: త్రివిధ దళాలకు సహకారం అవసరం: నల్గొండ కలెక్టర్‌

image

దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న త్రివిధ దళాలకు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని నల్గొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈనెల 7న నిర్వహించనున్న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌‌లో ఆమె మాట్లాడారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మనమంతా సహకరించాల్సిన బాధ్యత ఉందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

News December 5, 2025

నల్గొండ: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం అందాలి: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం (స్కాలర్‌షిప్‌) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్‌‌లో ఎంఈఓలు, సంక్షేమ శాఖల అధికారులతో ఆమె పాఠశాల విద్యార్థుల స్కాలర్‌షిప్‌ మంజూరుపై సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, ఏ ఒక్క పేద విద్యార్థి కూడా స్కాలర్‌షిప్‌ కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.