News April 11, 2025
చంద్రబాబును కలిసిన విజయవాడ సాఫ్ట్ టెన్నిస్ ప్లేయర్

CM చంద్రబాబు అభినందనలు అందుకోవడం ఎంతో గర్వకారణం అని విజయవాడకు చెందిన సాఫ్ట్ టెన్నిస్ ప్లేయర్ అనూష అన్నారు. గురువారం ఆమె సీఎం చంద్రబాబును కలిశారు. ఆమె మాట్లాడుతూ.. CM ప్రోత్సాహకరమైన మాటలు కొత్త స్పూర్తిని ఇచ్చాయని అనూష అన్నారు. తన కోచ్‌లు, ఫిజియోలు, ఏపీ సాఫ్ట్‌టెన్నిస్ అసోసియేషన్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల నోయిడాలో జరిగిన సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.
Similar News
News January 19, 2026
23న SC, ST సమస్యలపై ప్రత్యేక పీజీఆర్ఎస్

ఈనెల 23న SC, ST సమస్యలపై ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పోలీస్, అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులందరు హాజరు కావాలని ఆదేశించారు.
News January 19, 2026
సంపు ఏ దిశలో ఉంటే ఉత్తమం?

ఇంటి ప్రాంగణంలో బోరు, ఇంకుడు గుంతలు ఎక్కడున్నా, నీటిని నిల్వ చేసే ‘సంపు’ మాత్రం కచ్చితంగా ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశల్లోనే ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. సంపు కట్టేటప్పుడు అది ఇంటి మూలకు, ప్రహరీ గోడ మూలకు తగలకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. వాస్తుతో పాటు నిర్మాణ భద్రత వంటి శాస్త్రీయ కోణాలను కూడా దృష్టిలో ఉంచుకుని సంపు నిర్మాణం చేపడితే మేలు జరుగుతుందని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 19, 2026
ట్రంప్ విషయంలో సొంత పాలకుల పరువు తీసిన పాక్ జర్నలిస్ట్!

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి పాక్ PM షరీఫ్, మిలిటరీ చీఫ్ మునీర్ ఆయన్ను 2సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. చివరకు వాళ్లకు వీసా బ్యాన్ బహుమతిగా దక్కింది. పాక్ పాలకుల ఈ వ్యూహాత్మక వైఫల్యాన్ని ఆ దేశంలో ప్రముఖ జర్నలిస్ట్ హమీద్ మీర్ బాహాటంగానే ఎండగట్టారు. పైగా ‘భారత్ ఎప్పుడూ ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేయలేదు. అమెరికా విధానాలపై తనదైన దూరం పాటిస్తుంది’ అంటూ చురకలంటించారు.


