News June 8, 2024

చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు: గుంటూరు SP

image

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా అధికారులు పనిచేయాలని జిల్లా ఎస్పీ తుషార్ శుక్రవారం ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతE చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే క్రిమినల్ కేసును నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News September 29, 2024

రౌడీ షీటర్లు మంచి మార్గంలో జీవించండి: ఎస్పీ సతీశ్

image

గుంటూరు నగరంలోని రౌడీషీటర్లకు ఆదివారం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రౌడీషీటర్లు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి పద్ధతి మార్చుకొని మంచి మార్గంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించాలని సూచించారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతుందని చెప్పారు.

News September 29, 2024

అమరావతి: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.లక్ష విరాళం

image

క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆదివారం రూ.లక్ష చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తూ ఎంతగానో బాధితులను ఆదుకున్నారని క్రైస్తవ మిషనరీ సంఘం వారు ఆన్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సహాయం అందించడం జరిగిందని మిషనరీ బిషప్ అన్నారు.

News September 29, 2024

పల్నాడు: రైలులో భారీ చోరీ

image

హుబ్లీ నుంచి విజయవాడ వస్తున్న రైలులో శనివారం ఉదయం చోరీ జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన జ్యువెలర్స్ షాపు నిర్వాహకులు రంగారావు, సతీశ్‌లకు చెందిన రూ.2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. రైలు నంద్యాల చేరుకున్న అనంతరం తాము నిద్రపోగా చోరీ జరిగిందని, నంద్యాల రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చామని రంగారావు, సతీశ్ తెలిపారు.