News January 11, 2026

చర్మానికి స్క్రబ్ ఎందుకు చెయ్యాలంటే?

image

పని ఒత్తిడిలో పడి చాలామంది చర్మ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. దీంతో మృతకణాలు చేరి చర్మం నిర్జీవంగా మారుతుంది. అందుకే వీలు దొరికినప్పుడు శరీరం మొత్తానికి అంటే వీపు, మెడ, కాళ్లకు స్క్రబ్బింగ్ చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. దీనికోసం బాత్‌సాల్ట్, డీప్ క్లెన్సింగ్ మిల్క్ వాడొచ్చు. లేదంటే గులాబీరేకల ముద్దలో తేనె, పాలు, ఉలవపిండి కలిపి చర్మానికి పట్టించి స్క్రబ్ చెయ్యాలి. దీనివల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి.

Similar News

News January 15, 2026

కడప: వైట్ అండ్ వైట్‌లో మెరిసిన పోలీసులు

image

నిరంతరం విధి నిర్వహణలో భాగంగా డ్రెస్‌లో కనిపించే పోలీస్ అధికారులు భోగి పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తులలో కనువిందు చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా భోగి మంటలు వేసి భోగి పండుగను స్వాగతించారు. జిల్లా ఎస్పీతో సహా పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా కనిపించారు.

News January 15, 2026

సరస్ ప్రదర్శనలో సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

image

సరస్ ప్రాంగణంలో సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విధులు కెటాయించిన అధికారులు పటిష్టమైన ప్రణాళికతో బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. నల్లపాడు రోడ్డులోని జరుగుతున్న సరస్ ప్రదర్శనను బుధవారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. ప్రాంగణంలో స్టాల్స్, కంట్రోల్ రూమ్, ఫుడ్ కోర్ట్, ఎమ్యూజ్మెంట్ పార్క్‌ను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

News January 15, 2026

శుభ సమయం (15-1-2026) గురువారం

image

➤ తిథి: బహుళ ద్వాదశి రా.8.06 వరకు
➤ నక్షత్రం: జ్యేష్ఠ తె.6.05 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.35-7.30 వరకు, ఉ.9.21-9.40 వరకు, తిరిగి ఉ.11.30-మ.12.06 వరకు, మ.1.02-1.57 వరకు తిరిగి మ.3.48-సా.5.38 వరకు
➤ రాహుకాలం: మ.1.30-3.00 వరకు
➤ యమగండం: ఉ.6.00-7.30 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.10.16-11.00 వరకు తిరిగి మ.2.41-3.26 వరకు ➤ వర్జ్యం: ఉ.9.42-11.29 వరకు