News September 13, 2025

చర్లపల్లి-తిరుపతి ట్రైను అక్టోబర్‌లో ప్రారంభం

image

చర్లపల్లి-తిరుపతి రైలు వారానికి ఒక రోజు నడవనుంది. అక్టోబర్ 8 నుంచి ప్రతి బుధవారం చర్లపల్లిలో ప్రత్యేక రైలు తిరుపతికి ప్రారంభమవుతుంది. నడికుడి, పిడుగురాళ్ల, నెమలిపురి, రొంపిచర్ల, వినుకొండ, మార్కాపురం, కంభం, నంద్యాల స్టేషన్లలో ఆగుతుంది. తిరుపతి నుంచి ప్రతి గురువారం చర్లపల్లికి ప్రారంభమవుతుంది. గత సర్వీస్ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దుచేసి నూతన ట్రైన్‌ను నడిపేందుకు నిర్ణయించారు.

Similar News

News December 17, 2025

వాజేడు: 18 కి.మీ నడిచొచ్చి ఓటు వేశారు!

image

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామ ఆదివాసీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొండలు, గుట్టలు దాటుకుంటూ సుమారు 18 కిలోమీటర్లు నడిచి వచ్చి కొంగాల పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, గ్రామంలో 20 మంది ఓటర్లు ఉండగా, పలువురు వృద్ధులు రాలేకపోయారని వారు తెలిపారు. దీంతో గుత్తికోయ గూడాల్లో ఓటర్ల చైతన్యం, ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ భాగస్వామ్యాన్ని చాటుకున్నారు.

News December 17, 2025

మహబూబాబాద్: 86.91శాతం పోలింగ్ @1PM

image

మూడో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 6 మండలాల్లో కలిపి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 86.91శాతం పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. డోర్నకల్‌లో 89.79శాతం, గంగారంలో 84.83 శాతం, కొత్తగూడలో 83.01 శాతం, కురవిలో 86.78 శాతం, సీరోల్‌లో 89.60, మరిపెడలో 86.20 శాతం నమోదైంది.

News December 17, 2025

మీ బ్రెయిన్ వయస్సుని ఇలా తగ్గించుకోండి

image

వయస్సు పెరగడం సహజమే. కానీ బ్రెయిన్‌ను యవ్వనంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. USకు చెందిన ఫ్లోరిడా వర్సిటీ చేసిన అధ్యయనంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించిన వారి మెదడు వాస్తవ వయస్సు కంటే 8 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మంచి నిద్ర, సరైన బరువు, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం, ఒత్తిడిని నియంత్రించడం వంటివి బ్రెయిన్ ఆరోగ్యాన్ని పెంచినట్లు తేలింది. తద్వారా ఓల్డేజ్‌లో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు రావు.