News September 12, 2025

చర్ల: ఎదురుకాల్పుల్లో మావో మనోజ్ మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబాద్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మేడం బాలకృష్ణతో పాటు ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మనోజ్ ఉన్నారు. మనోజ్‌ స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మడికొండ. అతనిపై రూ. కోటి రివార్డు ఉందని అధికారులు తెలిపారు.

Similar News

News December 10, 2025

కృష్ణా: 1500కి పైగా ప్రమాదాలు.. కారణం అదేనా..?

image

భారీ లోడుతో, ఫిట్‌నెస్ లేని వాహనాల కారణంగా ఈ ఏడాది ఉమ్మడి కృష్ణాలో 1500కు పైగా ప్రమాదాలు జరిగాయి. వీటిని తనిఖీ చేసి సీజ్ చేయాల్సిన రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి వాహనాలను పట్టిపట్టనట్లు వదలడంతోనే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News December 10, 2025

1,284 మంది బైండోవర్: ఎస్పీ నరసింహ

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 170 సమస్యాత్మక గ్రామాలు గుర్తించామని ఎస్పీ నరసింహ చెప్పారు. గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నవారు, పాత నేరస్థులు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నవారు 1,284 మందిని ముందస్తుగా బైండోవర్ చేశామన్నారు. 136 కేసుల్లో రూ.9,50,000 విలువైన 1,425 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపాపారు. లైసెన్స్ కలగిన 53 ఆయుధాలను డిపాజిట్ చేయించామన్నారు.

News December 10, 2025

NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.