News April 1, 2024
చర్ల: ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

చర్ల సరిహద్దు ప్రాంతమైన సుక్మా జిల్లా తెట్టమడుగు అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. దీన్ని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఆప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలిస్తుండగా జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, నక్సల్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Similar News
News February 10, 2026
నిబంధనల మేరకే విధులకు హాజరు కావాలి: సీపీ

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పోలీసు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి, క్రమశిక్షణతో పనిచేసి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
News February 10, 2026
ఖమ్మం: దివ్యాంగులకు అలర్ట్.. దరఖాస్తుకు నేడే ఆఖరు!

దృష్టి, వినికిడి లోపం ఉన్న దివ్యాంగులు ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి వెల్పుల విజేత తెలిపారు. అర్హులు ఈ సాయంత్రంలోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువు దాటిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని ఆమె స్పష్టం చేశారు.
News February 10, 2026
ఖమ్మం: తెలంగాణ పోరాట యోధురాలు మృతి

తెలంగాణ పోరాట యోధురాలు గండూరి నర్సు బాయమ్మ మరణించారు. ఖమ్మం పరిధి మామిండ్ల గూడెంలో నివాసం ఉంటున్న ఆమె అనారోగ్యంతో మృతిచెందారు. కాగా ఆమె భర్త, సీపీఎం నేత గండ్లూరి కిషన్‌రావు 1976లో మామిండ్లగూడెంలోని తన ఇంటి సమీపంలోనే హత్యకు గురయ్యారు. ఆమె గతంలో ముదిగొండ మండలం బాణాపురం సర్పంచ్‌గా పని చేశారు. నర్సు బాయమ్మ మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.


