News November 6, 2025
చర్ల: ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ జిల్లా పరిధిలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. తాళ్లగూడెం ఠాణా పరిధిలోని అన్నారం, మరిమల్ల గ్రామాల సమీప అడవుల్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు ముగిసిన అనంతరం ఘటనా స్థలానికి వెళ్లిన భద్రతా బలగాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతదేహాలను సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 22, 2026
GHMC కమిషనర్ కొత్త ఆఫీస్‌లు ఎక్కడో తెలుసా?

ఫిబ్రవరి 10 తర్వాత GHMC 3 కార్పొరేషన్లు (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి)గా విడిపోనుంది. దీంతో కొత్త కార్పొరేషన్ల కార్యాలయాలు ఈ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న GHMC కార్యాలయంలోనే హైదరాబాద్, తార్నాక పాత HMDA కార్యాలయంలో మల్కాజిగిరి, మాదాపూర్‌లోని నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) బిల్డింగ్‌లో సైబరాబాద్ కార్పొరేషన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నట్లు తెలిసింది.
News January 22, 2026
గిల్ డకౌట్.. సర్ఫరాజ్ సెంచరీ

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ అనంతరం రంజీ ట్రోఫీలో ఆడుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ నిరాశపరిచారు. సౌరాష్ట్రతో మ్యాచులో ఈ పంజాబ్ బ్యాటర్ 2 బాల్స్ మాత్రమే ఆడి డకౌట్ అయ్యారు. మరోవైపు డొమెస్టిక్ క్రికెట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ హైదరాబాద్‌పై సెంచరీ బాదారు. ఇందులో 9 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.
News January 22, 2026
భద్రాద్రి: విద్యార్థుల చదువుల స్థాయిపై కలెక్టర్ అసంతృప్తి

ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలోని బాలుర ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం సందర్శించారు. విద్యార్థుల చదువు స్థాయిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వారికి అవసరమైన మౌలిక వసతులు తక్షణమే కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనవసర ఖర్చులు చేయకుండా విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం ఎంపీపీఎస్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి వారంలోగా పూర్తి చేయాలన్నారు.


