News September 11, 2025

చర్ల: ఐఈడీ బాంబు పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

image

చర్ల సరిహద్దులోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. బర్సూర్ ప్రాంతంలోని సత్‌గర్, మాలేవాహి మధ్య పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న CRPF జవాన్లు ఐఈడీ బాంబు దాడికి గురయ్యారు. గాయపడిన జవాన్లను వెంటనే దంతేవాడ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News December 13, 2025

ప్రకాశం జిల్లాలో 5.26 లక్షల సంతకాల సేకరణ

image

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి సోమవారం తరలిస్తామని దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా జిల్లాలో 5.26 లక్షల మంది సంతకాలు చేశారని చెప్పారు. వాటిని ప్రత్యేక వాహనం ద్వారా వైసీపీ ఆఫీసుకు తరలిస్తామన్నారు.

News December 13, 2025

HILTP: భూ బదిలీకి ఒక్క దరఖాస్తూ రాలేదు

image

TG: హిల్ట్ (HILT) విధానం కింద పారిశ్రామిక భూముల బదిలీ కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TSIIDC)కు ఇంకా ఎలాంటి దరఖాస్తులూ అందలేదు. తెలంగాణలో 21 పారిశ్రామికవాడలు ఉన్నాయి. HILTను NOV 22న ప్రకటించారు. దీని కింద భూముల బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే పరిశ్రమల యాజమాన్యాల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. త్వరలోనే యాజమాన్యాలతో ప్రభుత్వం భేటీ కానుంది.

News December 13, 2025

పప్పు గింజల పంటల్లో చిత్త పురుగులు.. నివారణ

image

మినుము, పెసర, అలసంద, కంది లాంటి పప్పు గింజల పైర్లు లేత దశలో(2-4 ఆకులు) ఉన్నప్పుడు చిత్త/పెంకు పురుగులు ఆశిస్తాయి. ఆకుల అడుగు భాగాల్లో చేరి రంధ్రాలు చేసి తినేస్తాయి. దీంతో మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వీటి నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 5గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML మందులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. పంటలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి.