News November 30, 2025
చలికాలంలో లంగ్స్ హెల్త్ కోసం ఈ ఫుడ్స్ తినండి

చలికాలంలో లంగ్స్ హెల్తీగా ఉండాలంటే యాంటీ-ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. బ్రోకలీలోని సల్ఫారఫేన్ బెంజీన్‌ను తొలగిస్తుంది. ఉసిరి, టమాటాల్లోని విటమిన్ C, ఆవాల ఆకుల్లోని A, C విటమిన్లు, అల్లం-పచ్చి పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, రామాఫలం, ఫ్లాక్స్ సీడ్స్‌లోని ఒమేగా-3 రోగనిరోధక శక్తిని పెంచి లంగ్స్ హెల్తీగా ఉండడంలో సహాయపడతాయి.
Similar News
News February 11, 2026
మెంటార్‌ని ఎంచుకుంటున్నారా?

మీరు రాణించాలనుకొనే రంగంలో సీనియర్లను మెంటార్‌గా ఎంచుకొనే ముందు వారు నిజంగా మీకు మార్గం చూపించడానికి తగిన వారేనా అన్నది గుర్తించాలి. వారిలో ఏ అంశం మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో గమనించాలి. అపజయాలు పొందిన వాళ్లనీ మార్గదర్శకుడిగా ఎన్నుకుంటే వారి తప్పుల గురించి తెలుసుకోవచ్చు. మెంటార్ శభాష్ అని వెన్ను తట్టడమే కాకుండా, తప్పు చేస్తున్నప్పుడు నిర్మొహమాటంగా తగదని మందలించే వారై ఉండాలి.
News February 11, 2026
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు కోల్పోయి 84,163 వద్ద.. నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 25,921 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, టైటాన్, మారుతీ, SBI షేర్లు లాభాల్లో.. HCL టెక్, ట్రెంట్, TCS, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు దిగుతున్నారు.
News February 11, 2026
బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

బీట్ రూట్‌లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.


