News November 8, 2025

చలి పెరుగుతుంది.. జాగ్రత్త: IMD

image

దేశవ్యాప్తంగా వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో చలి పెరుగుతుందని IMD పేర్కొంది. ‘వాయవ్య, సెంట్రల్ ఇండియాలో వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-5°C తక్కువగా ఉండే అవకాశముంది. సెంట్రల్, వెస్ట్ ఇండియాలో వచ్చే 48 గంటల్లో 2-3°C, ఈస్ట్ ఇండియాలో వచ్చే 3 రోజుల్లో 3-4°C తగ్గుదల ఉండొచ్చు’ అని అంచనా వేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Similar News

News January 24, 2026

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వేతనాలు, పెన్షన్ల పెంపు

image

జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, నాబార్డ్, RBI ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు పెరిగాయి. 46,322 మంది ఉద్యోగులు, 46,830 మంది పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు లబ్ధికలగనుంది. బీమా ఉద్యోగులకు 2022 ఆగస్టు, నాబార్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, RBI పెన్షనర్లకు 2022 నవంబర్ నుంచి ఈ పెంపు వర్తించనుంది. దీంతో బీమా ఉద్యోగులకు 12.41%, నాబార్డ్-20% జీతం పెరగనుంది. RBI పెన్షనర్లకు 10% పెరగనుంది.

News January 24, 2026

వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు!

image

AP: వేసవి సెలవుల్లో(ఏప్రిల్-మే) టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైస్కూల్ ప్లస్‌లో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. వేసవి సెలవుల్లో పని చేసిన టీచర్లకు ఆర్జిత సెలవులు ఇస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. రెగ్యులర్ పోస్టుల ఖాళీలు ఏర్పడే వరకు క్లస్టర్ టీచర్లు అక్కడే కొనసాగుతారని అన్నారు.

News January 24, 2026

Grok సేవలకు అంతరాయం

image

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ Grok సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రోక్ యాప్, ట్విటర్‌లోలోనూ అందుబాటులో లేదు. ‘హై డిమాండ్ కారణంగా గ్రోక్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. వాటిని సరిచేసేందుకు మేము కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మీకు సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని xAI సంస్థ తెలిపింది.