News August 11, 2025

చల్లసముద్రంలో కొత్త యూరియా విక్రయ కేంద్రం ప్రారంభం

image

ఇల్లందు మండలం చల్ల సముద్రం గ్రామంలో నూతన యూరియా విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం ప్రారంభించారు. రైతుల రద్దీని తగ్గించడానికి మండలంలో ఇది మూడో కేంద్రమని ఆయన తెలిపారు. రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. రైతులందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉందని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News March 15, 2026

NGKL: అడవుల్లో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తం

image

వేసవిలో అటవీ ప్రాంతాల్లో మంటలు వేగంగా వ్యాపిస్తాయని, జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ హెచ్చరించింది. సిగరెట్ ముక్కలు, అగ్గిపుల్లలు పడవేయడం వల్ల భారీ అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు గుర్తు చేశారు. వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రజలు, పర్యాటకులు సహకరించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు

News March 15, 2026

గద్వాల: గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై కలెక్టర్ హెచ్చరిక

image

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. గ్యాస్ పక్కదారి పట్టకుండా 11 మంది అధికారులతో ‘డిస్ట్రిక్ట్ ఎనర్జీ మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 11 గ్యాస్ ఏజెన్సీలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.

News March 15, 2026

తిరుపతి: మీకూ మెసేజ్‌లు వస్తున్నాయా..

image

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ CMD శివశంకర్ లోతేటి కోరారు. మీ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరిస్తూ, మరిన్ని వివరాల కోసం OTP చెప్పమని, ఈ క్లిక్ నొక్కాలని తదితర మోసపూరిత సందేశాలను నమ్మవద్దని సూచించారు. వినియోగదారులు సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని కోరారు.