News December 2, 2025
చల్వాయి వార్డులను పంచుకున్న మూడు పార్టీలు..!

ములుగు జిల్లా గోవిందరావుపేట(M) చల్వాయి సర్పంచ్ స్థానాన్ని సయోధ్యతో కాంగ్రెస్ దక్కించుకుంది. 14 వార్డులను మూడు ప్రధాన పార్టీలు పంచుకున్నాయి. కాంగ్రెస్‌కు 7, BRSకు 4, BJPకి 3 చొప్పున తీసుకుంటూ తీర్మానించుకున్నాయి. ఉప సర్పంచ్ పదవిని BRSకు కేటాయించారు. పొలిటికల్ రింగ్‌లో నిత్యం తలపడే ఈ మూడు పార్టీలు పల్లె పోరులో మిత్రులుగా మారడం విశేషం. పదవుల పందేరంలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని నిరూపణైంది.
Similar News
News February 18, 2026
కిటకిటలాడిన ఏడుపాయల క్షేత్రం

ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రం మంగళవారం రాత్రి భక్తజన సంద్రంగా మారింది. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా వేలాదిగా తరలివచ్చిన భక్తుల నామస్మరణతో ఏడుపాయల వనం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. అమ్మవారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు.
News February 18, 2026
హోలీ కానుకగా డీఏ పెంపు?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీ(మార్చి 4) కానుకగా DA పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం DA 58% ఉండగా మరో 2% పెరగొచ్చని అంచనా. ఇది JAN నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2000 సంవత్సరంలో ఒక శాతం డీఏ పెరగ్గా, ఈ ఏడాది పెంపు రెండో అత్యల్పం అవుతుంది. 2007, 2018, 2025లోనూ రెండు శాతమే నమోదైంది. కాగా <<18718812>>8వ వేతన సంఘం<<>> ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
News February 18, 2026
క్రీడా ప్రతిభకు వన్నె తెచ్చేలా ప్రభుత్వం కృషి: కలెక్టర్

క్రీడా ప్రతిభకు వన్నె తెచ్చేలా ప్రభుత్వం కృషిచేస్తోందని..ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ క్రీడా ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-13,15,17,19 విభాగాల్లో బాలురు,బాలికలకు జిల్లాస్థాయి చెస్ టోర్నమెంట్, సెలక్షన్స్ నిర్వహించారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా జిల్లాకు మంచి పేరు తీసుకురావలన్నారు.


