News November 30, 2025
చాయ్.. పానీ.. కార్యకర్తలతో కలిసి టీ తాగిన మంత్రి పొన్నం

సిరిసిల్ల పర్యటనకు వెళ్లే క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలతో కలిసి వేములవాడ నంది కమాన్ వద్ద చాయ్ తాగుతూ పిచ్చాపాటిగా ముచ్చటించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులతో కలిసి స్థానిక కార్యకర్తలతో ముచ్చటిస్తూ ఇక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 17, 2026
కుక్కలా నడుస్తుంది.. ఇంజినీర్‌లా ఆలోచిస్తుంది..

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో రోబో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. TCS అభివృద్ధి చేసిన ఈ రోబో కుక్కలా నడుస్తుంది. ఇంజినీర్‌లా ఆలోచిస్తుంది. రిస్కీ ప్రాంతాల్లో ప్రమాదాలు, తప్పిదాలను నివారించడమే ఈ ఆవిష్కరణ ఉద్దేశమని కంపెనీ చెబుతోంది. కంప్రెసర్లు, ఎలక్ట్రికల్ ప్యానల్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సమస్యలను, గ్యాస్ లీకేజ్, వెల్డింగ్ లోపాలనూ గుర్తించగలదు. కష్టతరమైన జోన్లలోనూ పని చేస్తుందట.
News February 17, 2026
శుక్ర మౌఢ్యమి ముగుస్తోంది కానీ!

ఈరోజుతో శుక్ర మౌఢ్యమి ముగియడంతో శుభకార్యాలు మొదలవనున్నాయి. అయితే ఈ మంచి రోజులు మే 9 వరకు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ కాలంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం. అలాగే మే 4 నుంచి 29 వరకు కర్తరీ దోషం ఉంది. ఈ సమయంలోనూ శుభకార్యాలు చేయరు. దీంతో మే నెలలో గృహారంభం, గృహప్రవేశం వంటి పనులు చేయరాదు. కాబట్టి ఈ లోపు మీ పనులు ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.
News February 17, 2026
కర్నూలు: అడవిలో మహిళ హత్య.. సంచలన తీర్పు!

గోనెగండ్ల మండలం బి.అగ్రహారం గ్రామానికి చెందిన దేవదాసుకు బైలుప్పలకు చెందిన లక్ష్మిని హత్య చేసిన కేసులో సోమవారం జీవిత ఖైదు పడింది. 2021లో మహిళ కనిపించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముద్దాయిని అరెస్ట్ చేసి విచారించారు. కసాపురం సమీప అటవీ ప్రాంతంలో హత్యచేసి శవాన్ని కాల్చినట్లు వెల్లడైంది. కేసును విచారించిన ఆదోని 2వ అదనపు జిల్లా జడ్జి నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధించారు.


