News September 10, 2025
చింతలపల్లిలో రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

వరంగల్ జిల్లా సంగెం మండలంలోని చింతలపల్లి రైల్వే గేటు సమీపంలో ఓ యువకుడు మృతి చెంది ఉన్నాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. సంగెం మండల కేంద్రానికి చెందిన భూపతి నాగరాజు(26) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 11, 2025
ప్రశాంతంగా తొలి విడత జీపీ ఎన్నికలు: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో మొదటి విడత జీపీ ఎన్నికలు గురువారంతో ప్రశాంత వాతావరణంలో ముగిశాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 79.40 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు. 10 మండలాల్లోని సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన పోలింగ్‌ను కలెక్టర్, ఐడీసీలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా, అలాగే పలు పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు.
News December 11, 2025
జగిత్యాల: గురుకుల పాఠశాలాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ గురుకుల చీఫ్ కన్వీనర్ క్రిష్ణ ఆదిత్య ఒకప్రకటనలో తెలిపారు. SC, ST, BC, OC విద్యార్థులు 5, 6, 9వ తరగతుల్లో ఇంగ్లీష్ మీడియం చదివేందుకు వచ్చే సంవత్సరం జనవరి 21 వరకు రూ.100 రుసుముతో ఆన్లైన్లో దరఖా చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు https://tgswreis.telangana.gov.inలో అప్లై చేసుకోవాలని కోరారు.
News December 11, 2025
ఏలూరు: రైలులో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి

రైలులో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. కుటుంబీకుల వివరాల మేరకు..లింగపాలెం(M) కలరాయినిగూడెంనకు చెందిన నాగరాజు (45) కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ..20 రోజుల క్రితం పెద్ద తిరుపతిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. రైలులో నిన్న రాత్రి స్వగ్రామానికి బయలదేరి ఏలూరుకు రాగా నాగరాజులో చలనం లేదు. అనంతరం గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదైంది.


