News September 11, 2025
చిక్కడపల్లిలో BRSV ఆందోళన

చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేశారు. BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనియాస్ యాదవ్ ఆధ్వర్యంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరశన కార్యక్రమం నిర్వహించారు. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అవుకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల గ్రూప్-1 పరీక్షలను రివాల్యుయేషన్ చేయాలని, మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేశారు.
Similar News
News December 9, 2025
నేడే తొలి T20.. హై స్కోరింగ్ గేమ్!

SAతో భారత్ 5 మ్యాచుల T20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్‌లో జరగనుంది. ఇది బ్యాటర్లకు అనుకూలించే పిచ్ కావడం, 2 జట్లలో హిట్టర్లు ఉండటంతో హైస్కోరింగ్ గేమ్ చూసే అవకాశముందని క్రీడావర్గాలు చెబుతున్నాయి. 2015, 2022లో ఇక్కడ SAతో భారత్ ఆడిన 2 T20ల్లోనూ ఓడింది. అటు ఇవాళ ఓ వికెట్ తీస్తే 3 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డ్ సృష్టించనున్నారు. 7PMకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
News December 9, 2025
మోక్షాన్ని కలిగించే సప్త క్షేత్రాలు

అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, ఉజ్జయిని, ద్వారక.. ఈ 7 నగరాలను ముక్తి స్థలాలు అంటారు. ఇక్కడ కొలువైన క్షేత్రాలను దర్శించుకుంటే మనిషికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. జీవితంలో ఒక్కసారైనా ఈ స్థలాలను దర్శించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చేసిన పాపాలు తొలగించుకోవడానికి, పరమాత్మ సాన్నిధ్యం పొందే అవకాశం కోసం చాలామంది ఇక్కడికి వెళ్తుంటారు. ఈ పవిత్ర క్షేత్రాలు భక్తిని, ఆధ్యాత్మికతను పెంచుతాయి.
News December 9, 2025
ఏపీలో US పెట్టుబడులకు సహకరించండి: లోకేశ్

APకి 18నెలల్లో రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. దేశంలోనే తొలిసారి MOUల తర్వాత నిర్ణీత సమయంలో పరిశ్రమలను గ్రౌండింగ్ చేసే సంస్థలకు <<18509404>>ఎస్క్రో అకౌంట్<<>> ద్వారా ప్రోత్సాహకాలను జమ చేయనున్నట్లు చెప్పారు. అమరావతిలో అతి త్వరలోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కాబోతోందని, APలో US పెట్టుబడులకు సహకరించాలని శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో భేటీ సందర్భంగా కోరారు.


