News August 20, 2025
చిగురుమామిడి: పాముకాటుకు గురై వ్యక్తి మృతి

పాముకాటుకు గురై రైతు మృతిచెందిన ఘటన బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. సుందరగిరికి చెందిన మెడబోయిన రమేష్ (40) ఈరోజు ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. గ్రామస్థులు గమనించి వెంటనే హుస్నాబాద్‌కు తరలించారు. చికిత్స పొందతూ మృతిచెందాడు.
నిరుపేద రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారుల కమిటీ మండల అధ్యక్షుడు రాజకుమార్ కోరారు.
Similar News
News January 21, 2026
ఏలూరు: హెచ్చరిక.. ఎవరూ బయటకు రావద్దు!

బుట్టాయగూడెం మండలంలో పులి సంచారం నేపథ్యంలో బుధవారం రాత్రి ఎవరు బయటకు రావొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. గాడిద బోరు, ఇనుమూరు, దొరమామిడి ప్రజలు తెల్లవారు అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెం సమీపంలో పులిసంచారం ఉందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
News January 21, 2026
వైద్య విద్యలో హైటెక్ విప్లవం: మంత్రి రాజనర్సింహ

రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు ప్రపంచస్థాయిలో రాణించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను అందుబాటులోకి తెచ్చి, అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన అందించాలని అధికారులను ఆదేశించారు. ఉస్మానియా, గాంధీ తరహాలోనే కొత్త కాలేజీల్లోనూ మెరుగైన విద్య ఉండాలని, ఇందుకోసం AI ఆధారిత లెర్నింగ్, వర్చువల్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
News January 21, 2026
మనుబోలు: రైలు పట్టాల సమీపంలో శవం

మనుబోలు మండలం కొమ్మలపూడి, వెంకటాచలం రైల్వే స్టేషన్ల మధ్య 157/08_10 వద్ద పట్టాల సమీపంలో ఓ మృతదేహాన్ని రైల్వే పోలీసులు బుధవారం గుర్తించారు. సహజంగా మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. బ్రౌన్ కలర్ ఫుల్ హాండ్స్ స్వెటర్, ఎరుపు, తెలుపు గీతల చొక్కా, పాచి కలర్ టీషర్ట్, స్కై బ్లూ బనియన్, నలుపు రంగు జీన్స్ ధరించి ఉన్నాడని రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు.


