News February 6, 2025
చిట్యాల వద్ద రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి

చిట్యాల మండలం వెలిమినేడు శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కర్ణాటక రాయచూర్ నుంచి విజయవాడకు హినప్ప రాజు (22) తన స్నేహితులతో వెళ్తున్నాడు. బైక్ అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో హినప్ప రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 18, 2026
రైతులందరికీ ‘డిజిటల్’ గుర్తింపు ఉండాల్సిందే: కలెక్టర్

జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేయించుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 5.54 లక్షల మంది పట్టాదారులు ఉండగా, కేవలం 2.41 లక్షల మందే నమోదు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ఈ నమోదు ఆవశ్యకమని, మీ-సేవ లేదా ఏఈఓల ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
News February 18, 2026
NLG: రేపటి వరకు రేషన్ బియ్యం పంపిణీ

రేషన్ బియ్యం ఈ నెల 19వ తేదీ వరకు సరఫరా చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాసన రఘునందన్ తెలిపారు. ఇప్పటివరకు రేషన్ తీసుకోని లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైనా కారణాలతో రేషన్ తీసుకోని వారికి అవకాశం ఉందని తెలిపారు.
News February 18, 2026
నల్గొండ: ఇంటర్ పరీక్షలకు సిద్ధం

నల్గొండ జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయగా, మొత్తం 27,018 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.


