News April 30, 2024

చిత్తూరులో నెల్లూరు వాసికి జైలుశిక్ష

image

నెల్లూరుకు చెందిన ఆంజనేయులు అలియాస్ సాయినాథ్ చౌదరి చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో ఉంటూ చిట్టీలు, వడ్డీ వ్యాపారం నిర్వహించాడు. 2022 ఫిబ్రవరి 21న రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో 64 మందికి రూ.6.4 కోట్లు బకాయి ఉన్నట్లు తేలింది. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ఆయనకు తొమ్మిదేళ్ల జైలుశిక్ష, రూ.1.55 లక్షల జరిమానా విధిస్తూ జడ్జి భీమారావు తీర్పుచెప్పారు.

Similar News

News December 9, 2025

రేపటి నుంచి టెట్ పరీక్షలు: నెల్లూరు DEO

image

రేపటి నుంచి ఈనెల 21 వరకు టెట్-2025 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో బాలాజీరావు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు ఆన్లైన్‌లోనే పొందవచ్చని పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు.

News December 9, 2025

నెల్లూరు: విద్యార్థులకు మరో అవకాశం.!

image

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ కే.సునీత తెలిపారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఇంకా భర్తీ కాని సీట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షకు రాకపోయినా సీట్లు పొందే అవకాశం ఉన్నందున ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News December 9, 2025

నెల్లూరు: “సాదా బైనామాల”కు సదావకాశం

image

తెల్ల కాగితాలపై చేసుకున్న పొలాల కొనుగోలు ఒప్పంద పత్రాలకు మోక్షం కలగనుంది. సాదా బైనామాల కింద ఉన్న వీటి వలన పొలాలకు యాజమాన్య హక్కులు లేక, విక్రయించుకోలేక, ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి. ఇలాంటివి సుమారు 18 వేల వరకు ఉన్నట్లు అంచనా. MRO లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 90 రోజుల్లో పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు మంచి రోజులు రానున్నాయి.