News March 10, 2025
చిత్తూరులో ముగ్గురిపై కేసు నమోదు

చిత్తూరులో మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ముగ్గురు మహిళల చేత వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆదివారం రాత్రి పోలీసులు లాడ్జిపై దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 24, 2026
ఖమ్మం: ‘రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి’

ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రంజాన్ మాసం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో, ముస్లిం ప్రతినిధులతో సమీక్షించారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద ఎక్కడైనా డ్రైనేజీ, అప్రోచ్ రోడ్డు గుంతల మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు.
News January 24, 2026
గన్ని బ్యాగుల స్టాక్ పటిష్టంగా భద్రపర్చాలి: అ.కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఉన్న గన్ని బ్యాగుల స్టాక్ పటిష్టంగా భద్రపర్చాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో గన్ని సంచుల స్టాక్‌పై గోడౌన్ మేనేజర్‌లతో సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్ నుంచి జూట్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయని, రాబోయే రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు గన్ని బ్యాగుల ఇబ్బందులు రాకుండా రేషన్ షాపులు, గోడౌన్ నుంచి అందుబాటులో ఉన్న స్టాక్ భద్రపర్చుకోవాలని సూచించారు.
News January 24, 2026
పరిశ్రమల ప్రోత్సాహకానికి రాయితీలు: అన్నమయ్య కలెక్టర్

చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహకానికి రాయతీలు అందజేస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మదనపల్లి కాన్ఫెరెన్స్ హాల్‌లో శనివారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహకానికి కస్టమర్లతో సమావేశమై మాట్లాడారు. సింగిల్ డెస్క్ విధానం కింద గడచిన 53 రోజుల్లో అందిన ధరఖాస్తుల పరిష్కారం, చిన్న, మద్య తరహా పరిశ్రమల ప్రోత్సాహనికి వివిధ రాయితీల మంజురు అంశాలపై సమీక్షించారు.


