News August 7, 2024

చిత్తూరులో 20 వేల చేనేత కుటుంబాలు

image

భారత ప్రభుత్వం 2015 నుంచి ఏటా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 20 వేల కుటుంబాలు పైగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, మదనపల్లె, వరదయ్యపాలెం, నారాయణవనం, పాలమంగళం, పులిచెర్ల ప్రాంతాల్లో సిల్క్, కంచి పట్టుచీరలు నేస్తుంటారు. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం చేనేత కార్మికులను ప్రోత్సహించింది.

Similar News

News December 13, 2025

చిత్తూరు: ALERT.. ఈ నెల 19 లాస్ట్.!

image

ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 19వ తేదీలోపు ఆన్ లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. టెన్త్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్స్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలన్నారు.

News December 13, 2025

చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు

image

చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి ఎరువులు, యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 2నెలల కాలంలో జిల్లాలో 4135 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్టు చెప్పారు. రాబోయే 21 రోజులకు 1,247 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. 2,117 టన్నులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.