News June 30, 2024

చిత్తూరు: అందుబాటులో లేని పూర్వ సీఈవో

image

చిత్తూరు జడ్పీ పూర్వ సీఈవో ప్రభాకరరెడ్డిని సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ కన్నబాబు ఇటీవల ఉత్తర్వలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఆర్డర్స్‌ను అందజేసేందుకు జడ్పీ ఉద్యోగులు చిత్తూరు నగరంలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు. అలాగే ఆయన వాట్సాప్, బైరెడ్డిపల్లె ఎంపీడీవో కార్యాలయానికి సస్పెన్షన్ ఉత్తర్వులను అందజేశారు.

Similar News

News October 6, 2024

తిరుపతి: బాలికతో అసభ్యకర ప్రవర్తన

image

తిరుపతి రూరల్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. గూడూరు మండలానికి చెందిన ప్రసాద్(50) కొంతకాలంగా తిరుపతి(R)లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉంటున్న 3వ తరగతి బాలికకు ఫోనులో అశ్లీల చిత్రాలు చూపించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు చితకబాది MRపల్లి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News October 5, 2024

సీఎం చంద్రబాబుకు వీడ్కోలు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగించుకొని శనివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగుపయనమయ్యారు. ఆయనకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య తదితరులు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News October 5, 2024

వకుళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన చంద్రబాబు

image

తిరుమల పాంచజన్యం వెనుక నూతనంగా నిర్మించిన వకుళామాత కేంద్రీయ వంటశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు రూ.13.45 కోట్లతో ఈ భవనం నిర్మించారు. 1.20 లక్షల మంది భక్తులకు సరిపడే విధంగా భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు.