News September 8, 2024
చిత్తూరు: జపాన్‌లో ఉద్యోగావకాశాలు
జపాన్ దేశంలో నర్సులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్ రెడ్డి కోరారు. బెంగళూరులో జపాన్ భాషపై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జీతం రూ.1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 99888 53335లో సంప్రదించాలని కోరారు.
Similar News
News October 15, 2024
తిరుపతి: రేపు కూడా పాఠశాలలకు సెలవు
తిరుపతి జిల్లాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి.శేఖర్ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో కాలేజీలకు కూడా వర్తిస్తుందన్నారు.
News October 15, 2024
తిరుపతి, చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు వీరే
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. కేబినెట్‌లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
News October 15, 2024
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సైక్లోన్ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురిసే భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007,గూడూరు కంట్రోల్ రూమ్ నెం: 8624252807,సూళ్లూరుపేట-8623295345,
తిరుపతి ఆర్డీఓ 7032157040,శ్రీకాళహస్తి ఆర్డీఓ-కంట్రోల్ రూమ్ నెం:9966524952