News October 5, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.141నుంచి రూ.153, మాంసం రూ.204 నుంచి 230 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.233 నుంచి రూ.255 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.195 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News January 23, 2026
చిత్తూరు: హెక్టారుకు రూ.56 వేల రాయితీ.!

కొబ్బరి తోట పెంపకానికి ప్రభుత్వం రాయితీ అందించనున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి రామాంజనేయులు తెలిపారు. ఎకరాకు 72 చెట్ల చొప్పున నాటాల్సి ఉంటుందన్నారు. అలా నాటితే హెక్టారుకు రూ.56 వేల చొప్పున ప్రభుత్వం రాయితీగా అందిస్తోందన్నారు. ఆసక్తి ఉన్న రైతులు పట్టాపాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాతో రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News January 23, 2026
అందుబాటులో 2,100 టన్నుల యూరియా

చిత్తూరు జిల్లాలో 2,100 టన్నుల యూరియా అందుబాటులో ఉందని డీఏఓ మురళీ తెలిపారు. 180 రైతు సేవా కేంద్రాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు ఇబ్బందిలేకుండా యూరియా అందిస్తామన్నారు. శుక్రవారం జిల్లాకు మరో 560 టన్నుల యూరియా రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News January 22, 2026
సెలవుపై వెళ్లిన చిత్తూరు జేసీ

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. ఈ నెల 21 నుంచి 31వతేదీ వరకు సెలవులో ఉంటారని అధికారులు తెలియజేశారు. జేసీగా ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.


