News June 18, 2024
చిత్తూరు జిల్లాలో 64 శాతం మంది పాస్

ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లమెంటరీ ఫలితాల్లో చిత్తూరు జిల్లా విద్యార్థులు పర్వాలేదనిపించారు. జిల్లాలో 4,742 మంది పరీక్షలు రాయగా 3,043 మంది పాసయ్యారు. 64 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. తిరుపతి జిల్లా 6,023 మందికి 3,602 మందే పాస్(60%) అవడంతో 13వ స్థానాన్ని పొందింది. ఒకేషన్లో చిత్తూరు విద్యార్థులు 750 మందికి 380 మంది.. తిరుపతి జిల్లా విద్యార్థులు 380 మందికి 235 మంది పాసయ్యారు.
Similar News
News January 15, 2026
చిత్తూరు ఎస్పీకి నోటీసులు

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలైన కవిత మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయవాది అర్షద్ అయుబ్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్న సంబంధిత అధికారులు ఈనెల 21న కమిషన్ ముందు హాజరై నివేదికను అందజేయాల్సి ఉంది.
News January 15, 2026
చిత్తూరు: మీ ఫ్రెండ్స్‌ను కలిశారా..?

చిత్తూరులో ఉంటే జీతం సరిపోదు. తప్పని పరిస్థితుల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ సంక్రాంతికి సొంతూరికి వచ్చేస్తుంటారు. ఈ మూడు నాలుగు రోజులు సరదాగా గడిపేస్తుంటారు. చాలా మంది తమ స్కూల్, కాలేజీ నాటి ఫ్రెండ్స్‌ను ‘గెట్ టూ గెదర్’ పేరిట కలుస్తుంటారు. మరి ఈ సారి మీ ఫ్రెండ్స్‌ను కలిశారా? లేదా కామెంట్ చేయండి.
News January 15, 2026
చిత్తూరు జిల్లాలో రేపటి నుంచి ఈ-ఆఫీస్

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి ఈ-ఆఫీస్ విధానం అమలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 98 ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలనకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. పనులు వేగవంతంగా పారదర్శకంగా జరిగేలా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


