News December 11, 2025

చిత్తూరు: మైనర్‌ బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

image

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4,100 జరిమానాను కోర్టు విధించినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు వెదురుకుప్పం(M) వెంగనపల్లెకు చెందిన మణి ఓ మైనర్ బాలికను ప్రేమించాలని వేధించాడు. 2020లో ఆమెను భయపెట్టి భాకరాపేటకు తీసుకువెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News January 19, 2026

చిత్తూరు: సమస్యలపై ఫిర్యాదుల వెల్లువ

image

జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 23 ఫిర్యాదుల అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 4, భూతగాదాలు 7, వేధింపులపై 3 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. మరోవైపు కలెక్టర్‌కు సైతం 113 ఫిర్యాదులు అందాయి.

News January 19, 2026

చిత్తూరు: వేమనకు నివాళులర్పించిన ఎస్పీ

image

యోగి వేమన జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ సోమవారం నివాళులు అర్పించారు. చిత్తూరు సాయుధ దళం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా పద్యాలను రచించి, ప్రజలను మెప్పించిన మహాకవి అని కొనియాడారు. ఆయన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం భావితరాలకు స్ఫూర్తి దాయకమన్నారు.

News January 19, 2026

గంగవరం డ్రైవర్స్ కాలనీలో జోరుగా వ్యభిచారం?

image

గంగవరం(M) డ్రైవర్స్ కాలనీలో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మదనపల్లె, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి ఓ మహిళ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నా ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. నిత్యం కాలేజీ విద్యార్థులు, బయట ప్రాంతాల నుంచి విటులు రావడంతో గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.