News September 10, 2024

చిత్తూరు: రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుడికి జైలు

image

ఓ వ్యక్తి మృతికి కారణమైన రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు జడ్జి వెన్నెల సోమవారం తీర్పు చెప్పారు. తిరువణ్ణామలై వాసి నాగరాజు చిత్తూరులో రిహాబిలిటేషన్ సెంటర్ నడుపుతుండగా.. మద్యం మాన్పాలని తరుణ్‌ను తల్లి ఆశ ఈ కేంద్రంలో చేర్చింది. అతడిని 6నెలలు కుటుంబానికి చూపకుండా, మోతాదుకు మించి ఔషధాలు ఇవ్వడంతో 2022లో మరణించాడు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందని తెలిపారు.

Similar News

News October 6, 2024

జీడీ నెల్లూరులో ఆన్లైన్ బెట్టింగ్‌కు కుటుంబం మొత్తం బలి

image

గంగాధర నెల్లూరులో ఆన్లైన్ బెట్టింగ్‌తో అప్పుల పాలైన నాగరాజు కుటుంబ సభ్యులు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిన్న రాత్రి నాగరాజు రెడ్డి మరణించగా శనివారం ఉదయం చికిత్స పొందుతూ ఆయన భార్య జయంతి, సాయంత్రం కుమార్తె సునిత మృతి చెందారు. ఆదివారం ఆయన కొడుకు దినేశ్ రెడ్డి కూడా మరణించాడు. ఆ కుటుంబంలో నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషదఛాయలు అలుముకున్నాయి.

News October 6, 2024

చిత్తూరు: వినాయక విగ్రహం నిమజ్జనంలో అపశ్రుతి

image

చిత్తూరులోని వినాయక విగ్రహం నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్తూరు నగరం గుర్రప్పనాయుడువీధికి చెందిన ఆకాశ్(14) కట్టమంచి చెరువులో దిగి కూరుకుపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అకాశ్‌ను వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చెరువు వద్ద తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కంటతడిపెట్టించాయి. చెరువులోకి ఒక్కడే దిగినట్లు సమాచారం.

News October 6, 2024

తిరుపతి: బాలికతో అసభ్యకర ప్రవర్తన

image

తిరుపతి రూరల్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. గూడూరు మండలానికి చెందిన ప్రసాద్(50) కొంతకాలంగా తిరుపతి(R)లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉంటున్న 3వ తరగతి బాలికకు ఫోనులో అశ్లీల చిత్రాలు చూపించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు చితకబాది MRపల్లి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.