News September 5, 2024

చిత్తూరు: వైసీపీ రాష్ట్ర విభాగంలో ముగ్గురికి చోటు

image

వైసీపీ కార్యాలయం అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో ముగ్గురు జిల్లా వాసులకు చోటు లభించింది. పాల ఏకిరి అధ్యక్షులుగా కుమార రాజా, వన్నెకుల క్షత్రియ విభాగ అధ్యక్షునిగా శీను రాజేంద్రప్రసాద్, విశ్వబ్రాహ్మణ అధ్యక్షురాలిగా పవిత్ర మురళీకృష్ణను నియమించారు.

Similar News

News September 20, 2024

మొగిలి ఘాట్‌లో మరో ప్రమాదం

image

బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌లో మరో ప్రమాదం జరిగింది. ఇటీవల ఇక్కడ ఘోర ప్రమాదం జరగడంతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. వీటిపై అవగాహన లేని ఓ టెంపో ట్రావెలర్ వేగంగా వచ్చి ఇక్కడ అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News September 20, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు హెల్మెట్ తప్పనిసరి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో బైక్‌లు వాడే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా హెల్మెట్లను వినియోగించడం ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

News September 19, 2024

తిరుపతి జిల్లాలో 27 మంది పోలీస్ కానిస్టేబుళ్లు బదిలీ

image

తిరుపతి జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను ఎస్పీ సుబ్బారాయుడు బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారి చేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లనో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి స్థాన చలనం కల్పించారు. బదిలీ అయిన వారు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.