News September 14, 2024
చిత్తూరు SP స్ట్రాంగ్ వార్నింగ్
ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. మొగిలిలో ప్రమాద ఘటనను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రహదారి లోపాలను సరిదిద్దడం, భారీ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరణ చేయడం లాంటి చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 13, 2024
పలమనేరు : 17న జాబ్ మేళా
APSSDC ఆధ్వర్యంలో 17వ తేదీన పలమనేరు పట్టణంలోని SVCR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 2 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, బి ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. స్థానిక, పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 13, 2024
తిరుపతిలో పెరిగిన చికెన్ అమ్మకాలు
గత నెల రోజులుగా పెరటాసి మాసం కారణంగా మాంసం అమ్మకాలు భారీగా తగ్గాయి. పెరటాసి మాసం ముగియడంతో ఆదివారం ఉదయం నుంచి మాంసం అమ్మకాలు జోరందుకున్నాయి. తిరుపతిలో చికెన్ ధరలు బాయిలర్, లింగాపురం రూ.240, లైవ్ రూ.150, స్కిన్ లెస్ చికెన్ రూ.260 కాగా గుడ్లు రూ.4.50 పైగా అమ్మకాలు సాగుతున్నాయి. త్వరలో కార్తీక మాసం కాగా అమ్మకాలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.
News October 13, 2024
SVU : డిగ్రీ ఫలితాలు విడుదల
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూన్ నెలలో డిగ్రీ (UG) B.A/B.COM/BSC/BCA/BBA/BA 4వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.