News November 7, 2025

చినప్పన్న పాలెం మాజీ సర్పంచ్ అచ్చియ్యదొర మృతి

image

వైసీపీ నేత, చిన్నప్పన్నపాలెం మాజీ సర్పంచ్ దొండా అచ్చియ్య దొర మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం తన ఇంటి వద్ద మెట్ల పైనుంచి జారిపడి గాయపడ్డారు. అనకాపల్లిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. బుచ్చయ్యపేట (M) కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. మూడు దఫాలు సర్పంచ్‌గా, రెండు దఫాలు పాల సంఘం అధ్యక్షుడిగా, వడ్డాది పీఏసీఎస్ ఉపాధ్యక్షుడిగా, కస్పా నీటి సంఘం అధ్యక్షుడిగా ఆయన పని చేశారు.

Similar News

News January 12, 2026

‘సేవలందిస్తున్న వారిని గుర్తించి అవార్డులకు ప్రతిపాదించాలి’

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‍భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో సామాజిక సేవలో పాల్గొనే వారికి అవార్డుల ప్రధానం జరుగుతుందని జేసీ భావన చెప్పారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. సామాజిక సేవలో పాల్గొనే ఉద్యోగులు, వివిధ సంస్థలు, సామాజిక సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అవార్డులకు ప్రతిపాదించాలని ఆదేశించారు.

News January 12, 2026

గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండవచ్చా?

image

ఇంటి గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండటం మంచిదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. ఈ నిర్మాణం బయట నుంచి వచ్చే సహజ గాలి, వెలుతురును అన్ని గదుల్లోకి ప్రసరించేలా చేస్తుందంటున్నారు. ‘ఇది గదిలో ఉండే వారికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇల్లు ఎప్పుడూ తాజాదనంతో ఉంటుంది. ఇంట్లో ప్రతికూలత తగ్గి, గృహస్థులు ఉత్సాహంగా తమ జీవితాన్ని గడపడానికి దోహదపడుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 12, 2026

సంగారెడ్డి: ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి’

image

జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.