News April 24, 2025

చిన్నగంజాంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొనసపూడి- తిమ్మసముద్రం రోడ్డు మార్గంలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కూలీలతో వెళుతున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో కడవకుదురు గ్రామానికి చెందిన మహిళా కూలీ సోమమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మరో ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 13, 2026

ASF: స్కాలర్‌షిప్స్ అకౌంట్‌లో జమ

image

ASF జిల్లాలోని ఎస్సీ విద్యార్థుల 2024-25 వార్షిక పోస్ట్-మెట్రిక్ ఉపకార వేతనాలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి అశోక్ మదిరె తెలిపారు. కేంద్రం రూ.10.86 లక్షలు, రాష్ట్రం రూ.10.49 లక్షల నిధులు విడుదల చేసింది. మొత్తం 212 మంది విద్యార్థుల ఖాతాల్లో జమ చేసి, కొంత నిర్వహణ కోసం మినహాయించి మిగతా మొత్తాన్ని ట్యూషన్ ఫీజులుగా కళాశాలలకు చెల్లించారని తెలిపారు.

News March 13, 2026

అల్లూరి జిల్లాలో ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 39 మంది దూరం

image

ఉమ్మడి అల్లూరి జిల్లాలో శుక్రవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 39మంది విద్యార్థులు దూరంగా ఉన్నారని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. 6 కేంద్రాల్లో బయాలజీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. అల్లూరి జిల్లాలో 172మందికి గాను 161మంది రాశారని, పోలవరం జిల్లాలో 223కి గాను 195మంది రాశారని తెలిపారు. ఏజెన్సీ DEO.మల్లేశ్వరావు అడ్డతీగల సెంటర్స్‌ను పరిశీలించి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

News March 13, 2026

తిరుపతిలో చిన్నారి మృతికి కారణం ఇదే..!

image

తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో రెండు రోజుల <<19369150>>పసికందు చనిపోయిన <<>>విషయం తెలిసిందే. దీనిపై ఆసుపత్రి సూపరిటెండెంట్ ప్రమీలాదేవి స్పందించారు. ‘పాలు తాగిన వెంటనే పడుకోబెట్టారు. దీంతో చిన్నారి ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్లాయి. రుయా చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. మిల్క్ ఆస్పిరేషన్ కారణంగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని ఆమె తెలిపారు