News May 7, 2025

చిన్నగొట్టిగల్లు: ఏనుగుల దాడిలో మరో రైతు మృతి

image

చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీలో శుక్రవారం రాత్రి ఏనుగులు భీభత్సం సృష్టించాయి. కొత్తపల్లి సమీపంలో ఓ రైతు సిద్దయ్యను తొక్కి చంపాయి‌. మృతుడు దాసరగూడెంకు చెందిన సిద్దయ్య(65)గా పోలీసులు గుర్తించారు. జనవరి 19వ తేది నారావారిపల్లె ఉప సర్పంచ్ రాకేశ్‌ని సైతం ఏనుగులు బలిగొన్న విషయం తెలిసిందే. వరుస ఘటనలతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Similar News

News February 7, 2026

సూర్యాపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా నివేదిత

image

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టర్ మురిశెట్టి లక్ష్మభి భార్య నివేదితను ఛైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి సన్నిహితుడైన లక్ష్మభి, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసమే పార్టీ మారి ఈ ‘బంపర్ ఆఫర్’ కొట్టేశారన్న చర్చ నడుస్తోంది. రాజకీయ అనుభవం లేకున్నా ఆమెకు టికెట్ దక్కడం స్థానికంగా రాజకీయ వేడిని పెంచుతోంది.

News February 7, 2026

మలేషియాకు బయలుదేరిన మోదీ

image

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ మలేషియా బయలుదేరారు. పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర తీర సహకారంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. అలాగే మలేషియాలోని భారతీయులను ప్రధాని ప్రత్యేకంగా కలవనున్నారు. కాగా మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి.

News February 7, 2026

విశాఖ: ఒకే ఒక్కడు.. 26 కేసుల్లో నిందితుడు

image

విశాఖ నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అచ్చి మహేష్ రెడ్డిని గాజువాక క్రైమ్, సీసీఎస్, మల్కాపురం పోలీసులు కలిసి అదుపులోకి తీసుకున్నారు. పెందుర్తి-10, గాజువాక-8, మల్కాపురం-2 కేసులతోపాటు ఇతర ప్రాంతాల్లో మరో ఆరు ఇతనిపై ఉన్నాయి. నిందితుడి నుంచి కేజీన్నార బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, BMW కారు, బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మరికాసేపట్లో పూర్తి వివరాలు కమిషనర్ వెల్లడించునున్నారు.