News December 1, 2025
చిన్నబజార్ PSను తనిఖీ చేసిన గుంటూరు IG

నెల్లూరులోని చిన్నబజార్ PSను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని పరిస్థితులు, స్థితిగతులు, నేర ప్రాంతాలపై సిబ్బందిని అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులపట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. వీరి వెంట ఎస్పీ అజిత వేజెండ్ల ఉన్నారు.
Similar News
News February 13, 2026
మన నెల్లూరు కలెక్టర్ లవ్ స్టోరీ తెలుసా..?

మన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా ముస్సోరీలో శిక్షణలో ఉండగా 2013లో కృతికా(పల్నాడు కలెక్టర్) పరిచయమయ్యారు. ప్రాంతాలు వేరైనా ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో పరస్పరం ఇష్టపడ్డారు. తమ కెరీర్‌కు ప్రాధాన్యమిస్తూనే ముందుకు సాగారు. తల్లిదండ్రులను ఒప్పించి 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి రియాన్ష్(8), పాప అహిల్యా(18 నెలలు) ఉన్నారు. లవర్స్ డే నేపథ్యంలో తమ ప్రేమ బంధాన్ని ఆయన Way2Newsకు వివరించారు.
News February 13, 2026
కాకాణి కుమార్తెకు నోటీసులు

కోవూరు మండలంలో ఇటీవల మైనర్ బాలిక మృతి దుమారం రేపింది. ఈక్రమంలో ఆమె మృతిపై వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు. నిరాధార ఆరోపణలు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 16వ తేదీ విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. బాలిక మృతి మీద ఆమె దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని రావాలని కోరారు.
News February 13, 2026
నెల్లూరు: మహిళలకు ఆ బస్సుల్లోనూ ఫ్రీ

శివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా నుంచి పలు ప్రాంతాలకు RTC తరఫున 147 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని ప్రజా రవాణా అధికారి షేక్ షమీం తెలిపారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. 14, 15, 16వ తేదీల్లో శ్రీశైలం, కోటప్పకొండ, సిద్ధేశ్వరం, మైపాడు తదితర ప్రాంతాలకు బస్సులు నడుస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


