News December 1, 2025
చిన్నారిని అత్యాచారం చేసి చంపారు: మంచిర్యాల DCP

దండేపల్లిలో బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. DCP భాస్కర్ వివరాల ప్రకారం.. సోమవారం శనిగారపు బాపు(52), ఉపారపు సతీష్(40)ను అరెస్ట్ చేశారు. ఈ నెల 24న ఓ 7ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశారు. అనంతరం హత్య చేసి గ్రామంలోని బావిలో పడేశారు. దర్యాప్తు చేపట్టి ఇవాళ మదాపూర్ రోడ్డు వద్ద ఇద్దిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద బాధితురాలి 2 గాజులు, పట్టగొలుసు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News February 17, 2026
AI వల్ల ఉద్యోగాలు పోవు.. స్కిల్స్ పెంచుకోవడమే మార్గం: మోదీ

AI వల్ల ఉద్యోగాలు పోవని, మార్పులకు అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవడమే మార్గమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఆధునిక సాంకేతికత మనుషులను తొలగించబోదని, సామర్థ్యాన్ని మాత్రమే పెంచుతుందని పేర్కొన్నారు. టెక్నాలజీ మారినప్పుడల్లా కొత్తరకం ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అందుకే ప్రభుత్వం రీ-స్కిల్లింగ్‌పై భారీగా పెట్టుబడి పెడుతోందని చెప్పారు. గ్లోబల్ AI ఇండెక్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉండటం మన సత్తాకు నిదర్శనమన్నారు.
News February 17, 2026
జేఈఈ మెయిన్స్‌లో ‘హార్వెస్ట్’ విద్యార్థుల ప్రభంజనం

JEE మెయిన్స్ మొదటి విడత ఫలితాల్లో హార్వెస్ట్ కాలేజీ విద్యార్థులు సత్తాచాటారు. కళాశాల నుంచి 250 మంది హాజరుకాగా.. కృష్ణ మనోహర్ 99.87%, అన్వితా రెడ్డి 99.47%, లోకేష్ 99.42%, స్ఫూర్తి 99.31%, సాయిచరణ్ 99.04% పర్సంటైల్ సాధించారు. మరో 30 మంది 90% పైగా మార్కులు పొందారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల వల్లే ఈ ఫలితాలు వచ్చాయని కరస్పాండెంట్ రవికుమార్, ప్రిన్సిపల్ పార్వతి రెడ్డి విద్యార్థులను అభినందించారు.
News February 17, 2026
రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం.. ఫొటోకు రూ.7-10

TG: పంటల నమోదు సర్వే కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివి గ్రామ భూములపై అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లిస్తారు. 45 రోజుల యాసంగి సీజన్‌లో 2000 ఫోటోల వరకు అప్‌లోడ్ చేయవచ్చు. విద్యార్హత పత్రాలతో మండల వ్యవసాయ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకోవాలి.


