News December 3, 2025
చిన్న తప్పుతో రూ.లక్షలు కోల్పోతున్నారు!

సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌తో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ‘FLAT SIP’ హ్యాబిట్‌తో రూ.లక్షలు కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. ‘ఎప్పుడూ ఒకే అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేయకూడదు. పెట్టుబడి మొత్తంలో ఏడాదికి కనీసం 10% పెంచాలి. Ex: నెలకు ₹10వేలు చొప్పున 20ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే (12% రిటర్న్స్‌తో) ₹99 లక్షలొస్తాయి. అదే ఏటా 10% పెంచుకుంటూ పోతే ₹1.5కోట్ల వరకు వస్తాయి’ అని వివరిస్తున్నారు.
Similar News
News February 10, 2026
జగన్‌కు జెడ్ ప్లస్ భద్రతను కల్పించాలి: వైసీపీ

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైసీపీ లేఖ రాసింది. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేసింది. జగన్ పర్యటనల్లో పోలీసులు ఇష్టమొచ్చినట్లుగా చివరి నిమిషంలో రూట్లు మారుస్తున్నారని ఆరోపించింది. ఇటీవల తలెత్తిన భద్రతా లోపాలను ప్రస్తావిస్తూ వాటిపై విచారణ చేపట్టాలని కోరింది.
News February 10, 2026
మా ఇంధనం ఇండియా కొనకుండా US అడ్డుకుంటోంది: రష్యా

ఇండియా, ఇతర భాగస్వాములు తమ చౌకైన ఇంధనం కొనకుండా నిషేధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపించింది. అధిక ధరలకు US LNGని కొనాలని బలవంతం చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ మండిపడ్డారు. ఉక్రెయిన్‌తో సమస్య పరిష్కారానికి అమెరికా ప్రతిపాదనను తాము అంగీకరించామని, కానీ కొత్త ఆంక్షలు విధించారని విమర్శించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లు, సరఫరా మార్గాలను నియంత్రించడమే ఆ దేశ లక్ష్యమని ఫైరయ్యారు.
News February 10, 2026
ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

యూపీలోని HLL లైఫ్‌కేర్ లిమిటెడ్ 5 ఫార్మాసిస్ట్, అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు ఫిబ్రవరి 17, 19 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి డీఫార్మసీ/బీఫార్మసీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.lifecarehll.com


