News September 12, 2025

చివరి రైతు వరకు ఎరువుల పంపిణీ సక్రమంగా జరగాలి: కలెక్టర్

image

జిల్లాలో చివరి రైతు వరకు ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి వ్యవసాయాధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎరువుల సరఫరా, పంపిణీ పై వ్యవసాయాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 78,624 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయడం జరిగిందన్నారు. ఈ నెల 12వ తేదీన సుమారు 600 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా జిల్లాకు రానున్నదన్నారు.

Similar News

News December 14, 2025

వరంగల్: 18.82% పోలింగ్ @9AM

image

స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశలో పోలింగ్ వరంగల్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మొత్తం 18.82 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు క్యూలో నిల్చొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.

News December 14, 2025

తాండూర్: సర్పంచ్ అభ్యర్థికి అస్వస్థత

image

తాండూర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి మాసు వెంకటస్వామి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఆదివారం పోలింగ్ మొదలైన నేపథ్యంలో వెంకటస్వామి ఇంట్లో నుంచి పోలింగ్ స్టేషన్ బయలుదేరారు. ఈ క్రమంలో వెంకటస్వామి ఒక్క సారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన చికిత్స కోసం వెంకటస్వామిని మంచిర్యాలకు రిఫర్ చేశారు.

News December 14, 2025

యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌కు ఇలా చెక్

image

40-50 ఏళ్లు పైబడిన మహిళల్లో యూరినరీ ఇన్‌కాంటినెన్స్(మూత్రంపై పట్టుకోల్పోవడం) సమస్య వస్తుంటుంది. దీనివల్ల తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు యూరిన్ లీకేజీ అవుతుంది. క్రమంగా ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే 12 వారాలపాటు వ్యాయామాలు, యోగా చేస్తే ఈ సమస్యను అదుపు చేయొచ్చని ‘స్టాన్‌ఫర్డ్ మెడిసిన్’ అధ్యయనంలో తేలింది. మందులతో సమానంగా దీని ఫలితాలు ఉంటాయని వెల్లడైంది. #WomenHealth