News April 14, 2025

చీడికాడ: విద్యుత్ స్తంభం ఢీకొని యువకుడి మృతి

image

చీడికాడ మండలం బి.సింగవరం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్సై సతీశ్ చెప్పారు. సబ్బవరం మండలం పెదగొల్లపాలెంకి చెందిన సిరసపల్లి జగన్మోహన్ మరో ఇద్దరు కలిసి బైక్‌పై అప్పలరాజుపురం నుంచి వెళ్తుండగా బి.సింగవరం వద్ద స్తంభాన్ని ఢీకొట్టారు. ప్రమాదంలో జగన్మోహన్ మృతిచెందగా.. వెనక కూర్చున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆవులు కాస్తున్న మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.

Similar News

News January 14, 2026

అంకెల్లో మేడారం..!

image

శానిటేషన్ బ్లాకులు: 285
టాయిలెట్లు: 5,700
పారిశుద్ధ్య సిబ్బంది: 5,000
ట్యాంకర్లు: 150
ట్రాక్టర్లు: 100
స్వీపింగ్ మెషిన్లు: 18
JCBలు: 12
స్వచ్ఛ ఆటోలు: 40
డోజర్లు: 16
ట్రాన్స్‌ఫార్మర్లు: 196
విద్యుత్ స్తంభాలు: 911
విద్యుత్ లైన్లు: 65.75 కి.మీ
విద్యుత్ సిబ్బంది: 350
డీజిల్ జనరేటర్లు(బ్యాకప్): 28
వైద్య సిబ్బంది: 5,192
అంబులెన్సులు: 30
బైక్ అంబులెన్సులు : 40
గజ ఈతగాళ్లు: 210
సింగరేణి రUస్క్యు: 12

News January 14, 2026

చిట్వేల్‌లో సంక్రాంతి పండుగ.. కుటుంబం అంతా ఒకే చోట భోజనం..!

image

సంక్రాంతి పండుగతో కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయని చిట్వేల్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. గత 50 ఏళ్లుగా భోగి రోజున నలుగురు అన్నదమ్ముల కుటుంబాలు కలిసి సంయుక్త అరిటాకు భోజనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. ఈ ఏడాది 46 మంది కుటుంబ సభ్యులు పాల్గొనగా, హైదరాబాదు, బెంగళూరు, విదేశాల్లో ఉన్నవారు కూడా భోగి రోజున కలుస్తారన్నారు. దీంతో కుటుంబాల్లో ప్రేమానురాగాలు మరింత బలపడతాయన్నారు.

News January 14, 2026

మహా జాతరకు భారీ ఏర్పాట్లు ఇలా..!

image

భక్తుల అంచనా: సుమారు 3కోట్లు
సిబ్బంది: 21శాఖలు.. 42,027మంది
ఆదివాసీ వాలంటీర్లు: 2వేలు
పరిపాలనా విభజన: 8 జోన్లు.. 42 సెక్టార్లు
శాశ్వత మొబైల్ టవర్లు: 27
తాత్కాలిక టవర్లు: 33
VHF సెట్లు: 450
పార్కింగ్ స్థలాలు: 1418 ఎకరాలలో 42
టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు: 4,000
మొత్తం ట్రిప్పులు: 51,000
ఆర్టీసీ సిబ్బంది: 10,441
తాగునీటి నల్లాలు: 5,482
జంపన్నవాగు వద్ద డ్రెస్సింగ్ రూములు: 119