News April 28, 2024

చీమకుర్తి: భారీగా గోవా మద్యం పట్టివేత 

image

చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడులో భారీ మద్యం డంపును సెబ్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన గంగిరేగుల వెంకట్‌రావు గోవా నుంచి తెచ్చిన 180ML బాటిళ్లు 1001లను మరోచోటకి తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు సెబ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విలేకరులతో మాట్లాడుతూ.. అతని కాల్ డేటా ఆధారంగా మిగిలిన నిందితులను గుర్తించి కేసు నమోదు చేస్తామని చెప్పారు.

Similar News

News April 14, 2026

ప్రకాశం: మరో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

image

మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు బస్టాండ్ సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు టైరు పగలడంతో అదుపు తప్పి డివైడర్ మీదకు వెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదు. తరచూ ట్రావెల్ బస్సులు ప్రమాదాలకు గురవటం ఒకింత ఆందోళనకు గురి చేస్తుంది.

News April 14, 2026

బాలికపై అత్యాచారం.. నిందితుడికి జైలుశిక్ష: ప్రకాశం ఎస్పీ

image

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు POCSO కోర్టు తీర్పు వెలువరించింది. దొనకొండ మండలానికి చెందిన వ్యక్తి 14 ఏళ్ల బాలికను మాయమాటలతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసుల దర్యాప్తుతో నేరం రుజువై శిక్ష విధించగా.. సంబంధిత అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులను అభినందించారు.

News April 14, 2026

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

image

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. 95% సైబర్ దాడులు నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని సోమవారం తెలిపారు. అనుమానాస్పద మెయిల్స్‌లోని లింకులను క్లిక్ చేయకూడదన్నారు. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించకపోవడం మంచిదని ప్రజలకు సూచించారు.