News May 2, 2024

చీరాల వాసులకు కీలక హామీలు ఇచ్చిన చంద్రబాబు

image

చీరాలలో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చీరల వాసులకు కీలక హామీలు ఇచ్చారు. చీరాలలో చేనేతలకు టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం. వాడరేవు బీచ్‌లకు పర్యాటక హబ్‌లుగా అభివృద్ధి. తాగునీటి సమస్య పరిష్కారం. తోటవారి ఎత్తిపోతల పథకానికి సురక్షిత నీరు అందించడం. పేరాల, వైకుంఠపురం రైల్వే బ్రిడ్జిల నిర్మాణం. చీరాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Similar News

News December 16, 2025

సమస్యలు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: ప్రకాశం కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ మీకోసం కార్యక్రమం అనంతరం జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలతో వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

News December 15, 2025

ప్రకాశం జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.!

image

మంగళగిరిలోని APSP 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో రేపు CM చంద్రబాబు చేతులమీదుగా కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 281 మంది అభ్యర్థులు మంగళవారం ఉదయం ఒంగోలు SP కార్యాలయం నుంచి మంగళగిరికి బయలుదేరతారు. సివిల్ ఉమెన్ కానిస్టేబుల్స్ 38 మంది, సివిల్ కానిస్టేబుల్స్ 88 మంది, ఏపీఎస్పీ 155 మంది వీరిలో ఉన్నారు.