News September 12, 2025
చీరాల: ‘హత్య చేశానంటూ లొంగిపోయాడు’

చీరాలలోని హారిస్ పేటకు చెందిన పేర్లి కోటేశ్వరరావు మృతి మిస్టరీ వీడింది. ఈ నెల 3న కోటేశ్వరరావు తన ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అనివార్య కారణాలవల్ల తానే కోటేశ్వరరావును హత్య చేశానంటూ నిందితుడు విజయ్ బాబు చీరాల టూ టౌన్ CI నాగభూషణం, SI వెంకటేశ్వర్లు ఎదుట గురువారం లొంగిపోయాడు. దీంతో చట్ట ప్రకారం విజయ్ బాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు.
Similar News
News December 12, 2025
కామారెడ్డి: NCC విద్యార్థిని అభినందించిన ఎస్పీ

భిక్కనూర్ మండలం మాందాపూర్ కౌంటింగ్ సెంటర్‌లో విధుల్లో ఉన్న NCC విద్యార్థితో KMR ఎస్పీ రాజేష్ చంద్ర ఆప్యాయంగా మాట్లాడారు. ఇది తన మొదటి డ్యూటీ అని విద్యార్థి చెప్పగా, అతని అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. అతనిలో ఉన్న నిబద్ధత ఉత్సాహం పట్ల SP అభినందించారు. మంచి స్ఫూర్తితో పని చేస్తున్నందుకు ధైర్యం, ఉత్సాహం నింపుతూ విద్యార్థిని మెచ్చుకున్నారు.
News December 12, 2025
ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అసంతృప్తి

TG: డ్యామ్‌ల భద్రతపై సమగ్ర నివేదిక ఇవ్వకపోవడం పట్ల ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేయడంపై వారిని నిలదీశారు. 174 డ్యామ్‌ల భద్రతపై 3 నెలల్లోగా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. నివేదికలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. డ్యాముల ప్రస్తుత స్థితి, O&M MANUAL, డ్యామ్ దెబ్బతిన్న సందర్భంలో అత్యవసర ప్రణాళికలు ఈ నివేదికలో ఉండాలన్నారు.
News December 12, 2025
సిద్దిపేట: యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా శనిగరం వాసి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఎంపికయ్యారు. ప్రధానమంత్రి సిఫారసు మేరకు ఇంగ్లాండ్ రాజు ఈ నామినేషన్ చేశారు. గతంలో లేబర్ పార్టీ అభ్యర్థిగా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నాగరాజు.. శనిగరానికి చెందిన హనుమంతరావు, నిర్మల దేవి దంపతుల కుమారుడు.


