News June 5, 2024

చెవిరెడ్డి ఫ్యామిలీకి ఘోర పరాభవం

image

వరుసగా రెండుసార్లు గెలిచిన చెవిరెడ్డికి ఈసారి ఫలితాలు నిర్ఘాంతపోయేలా చేశాయి. వైసీపీకి కంచుకోటగా ఉన్న స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఆయనతో పాటు కుమారుడు మోహిత్ రెడ్డి ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్నారు. చంద్రగిరిలో మోహిత్ రెడ్డి పులివర్తి నానిపై 43,852 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. అటు ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి టీడీపీ అభ్యర్థి మాగుంట చేతిలో 48,911 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.

Similar News

News November 5, 2024

తిరుపతిలోకి చిరుతపులులు చొరబడకుండా నియంత్రించాలి

image

తిరుపతి నగర పరిధిలోని జనావాస సాల్లోకి చిరుత పులులు చొరబడకుండా చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అటవీశాఖ అధికారులను కోరారు. తిరుపతి నగర సమీపంలోని అటవీ శాఖకు సంబంధించిన బయోట్రిమ్ ను మంగళవారం సందర్శించారు.‌‌ బయో ట్రిమ్ స్టేట్ సిల్వికల్చరిస్ట్ నరేందరన్, డీఎఫ్ఓ పవన్ కుమార్ రావుతో చర్చించారు. జనావాస సాల పరిధిలో అటవీ సరిహద్దులో ప్రహరీ నిర్మించేందుకు సాధ్య, సాధ్యాలను ఆమె కోరారు.

News November 5, 2024

చిత్తూరు: వ్యవసాయ పరపతి సంఘాల బలోపేతానికి చర్యలు చేపట్టండి

image

జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలో జాయింట్ వర్కింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఛైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గల 3,60,000 మంది రైతులలో 1.90 లక్షల మంది మాత్రమే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు.

News November 5, 2024

9న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 9న పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. 8వ తేదీ రాత్రి 8 నుంచి 9:00గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున మధ్యాహ్నం 1 నుంచి 5:00గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ మాడ వీధుల్లో శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.