News November 6, 2025
చేతులు మెరిసేలా..

కొందరిలో ముఖం ప్రకాశవంతంగానే ఉన్నా.. చేతులు మాత్రం జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. దీనికోసం ఉప్పుతో తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పులో లావెండర్ నూనె కలిపి దాన్ని చేతులకు రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటిస్తే చేతులపై చేరిన మృతకణాలు, మురికి తొలగిపోయి మృదువుగా మారతాయి.
Similar News
News January 20, 2026
ఆయుష్షును పెంచే మహోద్దేశ సూత్రాలు

మంచి అలవాట్లు ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఇస్తాయి.
ఆభరణాలు ధరిస్తే ఆయుష్షు పెరుగుతుంది.
చక్కని దుస్తులు ధరిస్తే ముఖంలో తేజోమయం అవుతుంది.
ప్రసన్నంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
నవ్వుతూ ఉంటే సంపద కలుగుతుంది.
పట్టుదలతో కృషి చేస్తే విజయం సొంతమవుతుంది.
ఇతరులకు సహాయపడితే క్షేమం కలుగుతుంది.
తృప్తిగా ఉంటే యవ్వనంగా ఉంటారు.
మధురంగా మాట్లాడితే అదృష్టం వరిస్తుంది.
మితంగా భుజిస్తే చక్కని రూపం సొంతమవుతుంది.
News January 20, 2026
ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలంటే?

గర్భం ధరించిన విషయం మహిళలు ఎంత త్వరగా గుర్తిస్తే బిడ్డకు అంత మంచిదంటున్నారు నిపుణులు. చాలామంది నెలసరి మిస్సవగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. అప్పుడు గర్భం ధరించినా కొన్నిసార్లు నెగెటివ్ రావచ్చు. నెలసరి మిస్సయిన వారానికి టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్ అయినా ఒక్కోసారి కొంతమందిలో నెగెటివ్ వస్తుంటుంది. మీకు లక్షణాలేమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News January 20, 2026
IIT రూర్కేలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

<


